ముంబైలో కుండపోత వర్షం.. బస్సుల్లోకి చొచ్చుకొచ్చిన వరదనీరు!

  • నీట మునిగిన పలు ప్రాంతాలు
  • మళ్లీ హెచ్చరించిన వాతావరణ శాఖ 
  • రాబోయే 4-5 గంటల్లో భారీ వర్షాలు పడతాయని ప్రకటన
మహారాష్ట్రలోని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో నగరంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. దీనికితోడు రాబోయే 4-5 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను బీఎంసీ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ముంబైలో వరదల తీవ్రతకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీ వర్షానికి వరదనీరు బీఎంసీ బస్సులోకి వచ్చేసింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 
Go Back to Shorts
Maharashtra
Mumbai
heavy rains
Bus
Flood water
BMC

More Telugu News